ఆర్మూర్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపల్‌కు నూతన కమిషనర్‌గా వచ్చిన జగదీశ్వర్ గౌడ్‌ని కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అంగడిబజార్‌లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పక్కకు మార్చడం జరిగిందని, అప్పటి కమిషనర్ శైలజ విగ్రహం మార్చుతూ అక్కడ విగ్రహానికి ఏలాంటి నష్టం జరగకుండా విగ్రహం చుట్టు సేఫ్టీగా వుండేటట్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి వరకు విగ్రహం చుట్టూ ఎలాంటి రక్షణ లేకుండా ఉందని గుర్తుచేశారు.
దేశానికి సేవచేసి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన మహా నాయకుని అవమానం చేస్తునట్టుగా ఉందని, అప్పటి కమిషనర్ శైలజ చేసిన పనితీరు ఇప్పటి కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌కి విషయం చెప్పి విగ్రహం చుట్టూ సేఫ్టీగా ఉండేలా ఎర్పాటు చేయాలని కోరారు. కమిషనర్ దానిని పరిశీలించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు.
కార్యక్రమంలో మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ బబ్లు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోండ్ల బొజేందర్, మందుల పోశెట్టి, రాజేశ్వర్, గంగాధర్, షేక్ వసీమ్, ఆఫేన్ బీన్ అలీ, ఆమీర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.