కామారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సవరించిన భూముల ధరలకు సంబంధించి పట్టణ స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చైర్మనుగా, రిజిస్టార్ కన్వీనరుగా, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ సభ్యులుగా ఉంటారని, గ్రామీణ స్థాయిలో ఆర్డీవో చైర్మనుగా, సబ్ రిజిస్టార్ కన్వీనరుగా, తాసిల్దార్, ఎండివోలు సభ్యులుగా అధికారం కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో, ఆర్‌డీఓలు, సబ్ రిజిస్టార్‌లు, తహసీల్దార్లు, ఎండిఓలతో భూముల ధరల సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడిరది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 48 ప్రకారం భూముల ధరల సవరణ అధికారం అధికారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
గత 8 సంవత్సరాల నుండి భూముల ధరల సవరణ జరగలేదని, క్షేత్రస్థాయి ధరలకు, రిజిస్ట్రేషన్ ధరలకు తేడా ఉన్నందున ప్రభుత్వం ఈ మార్పు చేసిందని అన్నారు. ప్రతి మండలంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సెపరేట్‌గా పరిశీలించాలని, అన్ని రెవెన్యూ గ్రామాలు కవర్ అయ్యాయా లేదా పరిశీలించాలని తెలిపారు.
అర్హతగల వారికి ఆహార భద్రత కార్డులు ఇవ్వాలని తాసిల్దార్‌లను ఆదేశించారు. పెండిరగ్‌లో ఉన్న ఆహారభద్రత కార్డులను విచారణ జరిపి డీఎస్‌ఓ లాగిన్‌కు పంపాలని సూచించారు. అర్హతగల పేదల నుంచి ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని, నిరుపేదలందరికీ కార్డులు అందే విధంగా చూడాలని ఆదేశించారు. ఈనెల 26 నుంచి కొత్త కార్డుల పంపిణీ ఉన్నందున, సోమవారంలోగా అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డిఎస్‌ఓకు పంపాలని తెలిపారు.
గ్రామస్థాయిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు అర్హులైన నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు ఇప్పించే విధంగా, ఆన్ లైన్ ద్వారా నమోదు చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, ఆర్డీవోలు రాజాగౌడ్, ఎస్. శీను, జిల్లా పరిషత్ సీఈవో సాయిగౌడ్, డిఎస్‌ఓ రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.