డిచ్‌పల్లి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్‌ను శనివారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్స్ పరీక్షలు ఇటీవలే (15 వ తేదీన) ముగిసిన విషయం విదితమే.
కాగా డిగ్రీ కోర్సుల్లో గల తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో స్పాట్ వాల్యూయేషన్ శుక్రవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ (విజ్ఞాన సౌధ) లో ప్రారంభమైంది.
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వీసీ మాట్లాడుతూ పరీక్షలు ముగిసిన అతి కొద్ది కాలంలోనే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభించడం ప్రశంసనీయమైనదని అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం వరుసగా లాక్ డౌన్ ప్రకటించినా గాని విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండడం పరీక్ష ఫలితాల విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
సబ్జెక్ట్ ఎగ్జామినర్స్ కొవిద్ – 19 నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అత్యంత పారదర్శకంగా సమాధాన పత్రాలను పరిశీలించాలని సూచించారు. వాల్యూయేషన్ లో నాణ్యతను కోల్పోకుండా ప్రామాణికతను పాటించాలని పేర్కొన్నారు. సబ్జెక్టులకు కో – ఆర్డినేటర్స్‌గా ఆచార్య. పి. కనకయ్య, డా. జి. రాంబాబు, డా. బి. సాయిలు, డా. హలీం ఖాన్, టి. సంపత్ వ్యవహరిస్తున్నారు. అడిషనల్ కంట్రోలర్స్ డా. బాలకిషన్, డా. అథిక్ సుల్తాన్ ఘోరి స్పాట్ వాల్యూయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సెంట్రల్ లైబ్రరీ, గెస్ట్ హౌస్ సందర్శన :
స్పాట్ వాల్యూయేషన్ పర్యవేక్షించిన అనంతరం సెంట్రల్ లైబ్రరీలోని వివిధ సెక్షన్స్ సందర్శించారు. సబ్జెక్ట్ ప్రకారం పుస్తకాల అమరికను పరిశీలించారు. రిఫరెన్స్, కాంపిటెటీవ్, రీసర్చ్ విభాగాలలో గల ఇంటర్నేషనల్, నేషనల్ జర్నల్స్ గూర్చి లైబ్రేరియన్‌ను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం యూనివర్సిటి గెస్ట్ హౌస్‌ను వీసీ సందర్శించారు. మినీ సెమినార్ హాల్, డైనింగ్ సెక్షన్, కిచెన్, వసతి గదులను పరిశీలించారు. వాటి పరిశుభ్రత నిర్వహణపై ఎస్టేట్ ఆఫీసర్స్ యాదగిరి, అసోక్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.

వీసీ వెంట ప్రిన్సిపాల్ డా. వాసం చంద్ర శేఖర్, ఆర్ట్స్ డీన్ ఆచార్య అత్తార్ సుల్తానా, పిఆర్‌ఓ డా. వి. త్రివేణి, చీఫ్ వార్డెన్ డా. జమీల్, డా. ఖురేషి, ఎ ఆర్ సాయా గౌడ్, లైబ్రేరియన్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.