నిజామాబాద్, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో భాగస్వామిగా ఏ.ఐ.కే.ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుందని, పోరాటాలను సమన్వయం చేస్తూ సమీక్షించుకోవడం కొరకు జాతీయ కౌన్సిల్‌ను ఢిల్లీ రైతు పోరాట కేంద్రంలో జూలై 19, 20 తేదీల్లో జరుపుకుంటుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు.
కౌన్సిల్‌లో హాజరు కావడానికి నిజామాబాద్ జిల్లా నుండి ప్రతినిధులుగా వెళుతున్నామన్నారు. రైతు వ్యతిరేక మోడీ సర్కారుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఉద్యమంలో దాదాపు 600 మంది రైతులు మరణించారని, వారందరికీ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.
వ్యవసాయ రంగాన్ని రైతు పండిరచిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ధర నిర్ణయించే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బాబన్న తదితరులు ఉన్నారు.