వేల్పూర్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అనంతరం సోమవారం సందర్భంగా అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరుపుకోవాలని గర్భవతులకు సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.