మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాధిపతిగా డా. ఘంటా చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం విభాగాధిపతి ఉత్తర్వులను డా. ఘంటా చంద్రశేఖర్‌ కు అందించారు.

డా. ఘంటా చంద్రశేఖర్‌ ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, పీఆర్వోగా, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా, యూనివర్సిటీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌గా పలు పాలనాపరమైన పదవులు నిర్వర్తించారు. మాస్‌ కమ్యూనికేషన్‌, సోషల్‌ వర్క్‌ విభాగాలకు విభాగాధిపతిగా, బిఓఎస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు.

మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా డా. ఘంటా చంద్రశేఖర్‌ నియమింపబడడం పట్ల అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »