నందిపేట్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని ముస్లిం సమాజ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల ముస్లిం కమిటీ నాయకులు సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మండల కేంద్రంలో కలిసి వినతి పత్రం అందించారు.
మండల కేంద్రంలో గల షాది ఖానకు నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. అదే విధంగా గ్రామాలలో గల ఖబ్రస్తాన్, ఈద్గాప్ాల ప్రహరీ గోడలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఉర్దూ స్కూల్‌ను ఇంటర్మీడియట్ స్థాయి తీసుకెళ్లాలని, మండలంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.