కామారెడ్డి, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోగల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ స్వతంత్ర సమరయోధుడు మంగల్ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ మంగళ్ పాండే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు.
మంగల్ పాండే 1827, జూలై 19న ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జన్మించారని, బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికాడని, మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్‌లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల యువకుడు,
మంచి సాహసవంతుడు అన్నారు. తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐలో చేరాడని, మంగళ్ పాండే అప్పట్లో రaాన్సీలక్ష్మి బాయికి కూడా సహకారం అందించారని పేర్కొన్నారు.
భారతదేశ స్వతంత్య్ర చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడన్నారు. ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకోవాలని మహనీయులను మరువద్దని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఎం వి. భాస్కర్, పర్వత రావు, రాజయ్య, బాలకృష్ణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.