మోర్తాడ్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 10 లక్షల 29 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు మంజూరు చేయించారని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, టిఆర్ఎస్ మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఎంపీటీసీలు, సర్పంచులు సౌజన్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.