వేల్పూర్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతే గ్రామ ప్రజల 30 సంవత్సరాల కోరిక నేడు నెరవేరిందన్నారు.
గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు కానీ ఏ యొక్క అభివృద్ధి పనులు చేయలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు సంవత్సరాల్లోనే రైతుల కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఉంటున్నారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలంలోని పలు చెక్ డ్యాములు కట్టించి రైతులకు సంవత్సరానికి మూడు పంటలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.