ఆర్మూర్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల పట్టు చేనేత సంఘంను పట్టు చేనేత సహకార సిల్క్ సొసైటీ ఏడి వెంకటరమణ సందర్శించారు. పట్టు చేనేత సంఘం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సొసైటీ పరిధిలో అర్హులైన వారికి వచ్చే స్కీమ్ల వివరాలు అర్హులైన వారికి వివరించాలని, ప్రభుత్వం పథకాలు వర్తింప చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఇప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి పట్టు చేనేత సంఘంను సందర్శించడం జరుగుతుందని పట్టు చేనేత సంఘంను పరిశుభ్రంగా ఉంచాలని రికార్డులను పరిశీలించడంతోపాటు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు.
సొసైటీ పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుందని సభ్యులు అధికారులకు తెలియడంతో పైస్థాయి అధికారుల ద ృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గణేషమ్ సొసైటీ సీనియర్ నాయకులు పోహార్ శైలేష్ కర్తన్ దినేష్ మారుతి సంఘ సభ్యులు పాల్గొన్నారు