ఆర్మూర్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నదని, ప్రాజెక్టు గేట్లు కొద్ది సమయంలో తెరిచే అవకాశం ఉందని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నదిలోకి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.