నిజామాబాద్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వివిద బీడీ కంపనీలలో ఇరవయి, ముప్పై సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడి బీడీలు చేసి వారి రెక్కల కష్టం నుంచి పీఎఫ్‌లో జమ చేసిన పీఎఫ్ డబ్బులను వాపసు తీసుకోవాలంటే కార్మికులకు పీఎఫ్ నెంబర్ పెట్టే సమయంలో లేనటువంటి ఆదార్ కార్డులలో కార్మికుల పేరు, ఇంటి పేరు, తండ్రి, భర్త పేర్లు సరిలేవంటూ ధరఖాస్తులను వాపసు చేస్తున్నారని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దీని మూలంగా సంవత్సరాల తరబడి కష్టపడి జమ చేసుకున్న డబ్బులు రాక ఇబ్బందుల పాలు అవుతున్నారని, ఈ విషయంలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెలలో పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రిజినల్ కమిషనర్‌కు వినతి పత్రాన్నిఇచ్చి చర్చించామన్నారు. అయితే వారు ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారన్నారు.
అట్టి విషయంలో ఈ నెల 20 తారీఖున కమీషనరు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రాష్ట్ర కమిటి ప్రతినిధి బృందం చర్చించడానికి వెళ్ళగా కార్మికుల సమస్యల పరిష్కారానికి సరిjైున సమాదానం చెప్పకుండ దురుసుగా ప్రవర్తించడం జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కమిషనర్ తన పద్దతిని మార్చుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల పీఎఫ్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అశోక్, మరియ, గంగామణి, నీరజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.