కామారెడ్డి, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలి కాన్పరెన్సులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు.
భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 35 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 174 ఎకరాలలో వరి, సోయాబీన్, పత్తి పంటలకు నష్టం జరిగిందని ఆర్డిఓ శీను తెలిపారు. లింగంపేట మండలంలో రెండు గేదెలు మృత్యువాత పడినట్లు చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో 55 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు చెప్పారు.
ముప్పై మూడు ఎకరాలలో సోయాబీన్, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మాచారెడ్డి మండలం సోమరం తండాలో రోడ్డు ధ్వంసమైందని చెప్పారు. జిల్లాలో 14 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు గుర్తించామని ట్రాన్స్‌కో ఏస్.ఈ. శేషారావు తెలిపారు. 7 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని చెప్పారు. మిగిలిన ఏడు స్తంభాలు తక్షణమే పునరుద్ధరణ చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని చెరువులు పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నిజాంసాగర్, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టులలో నీటి నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న కల్వర్టులను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. అద్వానంగా మారిన రోడ్లును గుర్తించి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. టెలి కాన్షరెన్సులో పోలీస్, రెవిన్యూ, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.