కామారెడ్డి, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.
శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఆర్థిక సాయం అనాధ పిల్లల పోషణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, సంక్షేమ శాఖ అధికారిని అనురాధ, జిల్లా బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ జానకి పాల్గొన్నారు.