వేల్పూర్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ మొక్కలు నాటే గుంతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వనం శేఖర్, లింబాద్రి గౌడ్, శివ, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.