ఆర్మూర్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలూరు గ్రామంలో కూలిన ఇండ్లను, నష్టపోయిన పంట పొలాలను అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన ఇండ్లను, మునిగిన పంటల వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదించారు.
కార్యక్రమంలో ఇంఛార్జి ఎమ్మార్వో లక్ష్మణ్, ఎంపీడీవో గోపి, ఎంపిపి పస్క నర్సయ్య, వైస్ ఎంపిపి మోతె చిన్నారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, కార్యదర్శి సాజన్, వార్డు సభ్యులు గంగారెడ్డి, మహేష్, శ్రీకాంత్, సాయిలు గ్రామ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.