నందిపేట్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. నందిపేట్ మండలంలో చెరువు పూర్తిగా నిండి నందిపేట్ గ్రామంలోని శపూర్ రోడ్డు వరకు నీరు వచ్చింది. చెరువుల నీరు అలుగుల మీది నుండి రోడ్లపై పారుతున్నవి. నీటి ఉధృతికి చేపలు కొట్టుకొని పోతున్నాయి.
చెరువులలో ఉండే చేపలు రోడ్లపై తేలాయి. ఇదే అదునుగా ప్రజలు చేపలు పట్టడానికి చెరువుల వద్ద గుమి గూడి కట్టెలతో కొట్టుకుంటు పట్టుకొన్నారు. తాము మూడు సంవత్సరాల నుండి పెంచిన చేపలు ఒక్క సారిగా వర్షపు వరద తాకిడి కొట్టుకుపోవడంతో ముత్స్యకారుల గుండెలు పగిలినంత అయింది. నందిపేట్ మండలంలోని శపూర్ గ్రామ ముత్స్యకారులు మీడియాతో మాట్లాడుతు లక్షల టన్నుల చేపలు కొట్టుకుపోవడంతో తమకు భారీ ఆర్థిక నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే నష్ట పరిహారం వలే తమకు కూడ నష్ట పరిహారం కల్పించాలని వేడుకొన్నారు. అలాగే ఉచిత చేప పిల్లలను వెంటనే ఇవ్వాలని కోరారు.
మత్స్య శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు నష్టపోయిన చేపల విషయం ప్రభుత్వానికి నివేదిక పంపాలని బిఎస్‌పి ఆర్మూర్ నియోజక వర్గ ఇంచార్జి కొమిరె సుధాకర్ కోరారు. 50 కి పైగా గల గుండ్ల కులస్తుల కుటుంబాలను ఆదుకోవాలని గుండ్ల సాయిలు, శంకర్, భూమన్న, ఆడేందర్ తదితర గుండ్ల కులస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.