టీయూను దర్శించిన అమెరికా రోవన్‌ యూనివర్శిటి కెమిస్ట్రీ ప్రొఫెసర్‌

డిచ్‌పల్లి, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వద్యాలయానికి అమెరికా రోవన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం (అజో విభొ కందాళం) ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కందాళం రామానుజాచారి శనివారం ఉదయం విచ్చేశారు. ప్రాణ స్నేహితుడైన ఆచార్య డి. రవీందర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులు కాబడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయానికి విచ్చేసిన కందాళం రామానుజాచారిని వీసీ గౌరవ పూర్వకంగా స్వాగతం పలికి తన చాంబర్‌లో పుష్పగుచ్చం, శాలువా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల విద్యార్థులు కోర్సుల వివరాలు, పరిశోధకుల నూతన ఆవిష్కరణలు, ఫెలోషిప్స్‌, విదేశాలలో పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న వారి విషయాలను గూర్చి తెలుసుకున్నారు.

పరిపాలనా భవనంలోని రిజిస్ట్రార్‌ చాంబర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆడిట్‌ సెల్‌, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌, ఇ.డి.పి. సెక్షన్‌, ఎస్టాబ్లిష్‌ మెంట్‌, అకౌంట్‌, పీఆర్‌ఓ ఆఫీస్‌ వంటి కార్యాలయాలు, ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల, అందులో జరుగుతున్న పరీక్షలు, తరగతి గదులను, సైన్స్‌ ప్రయోగశాలలను బాలుర, బాలికల హాస్టల్‌ భవనాలను, న్యాయ, కంప్యూటర్‌ సైన్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌, కామర్స్‌ కళాశాలలను, గెస్ట్‌ హౌస్‌, క్యాంటీన్‌, హెల్త్‌ సెంటర్‌, సెంట్రల్‌ లైబ్రరీలో గల రీసర్చ్‌, రెఫరెన్స్‌, కాంపిటేటివ్‌ జర్నల్స్‌, ఆయా విభాగాలకు చెందిన పుస్తకాలను, అక్కడ జరుగుతున్న డిగ్రీ స్పాట్‌ వాల్యూయేషన్‌ను తిలకించారు.

ఈ సందర్బంగా కందాళం రామానుజాచారి మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం పచ్చని ప్రకృతిలో ఉండి ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు. విద్యార్థుల నాణ్యమైన విద్యాభ్యసనం, ప్రామాణిక పరిశోధనా పద్ధతులు తెలుసుకున్నానన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులైన ఆచార్య డి. రవీందర్‌ కృషి వల్ల విశ్వవిద్యాలయ పురోభివృద్ధి కలుగుతుందన్నారు. వీసీ తనకు ప్రాణ స్నేహితుడని, ఆయన పరిశోధనా నేపథ్యం తనకు చాలా కాలంగా తెలుసని అన్నారు.

ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతిక రంగంలో వీసీ పేరు పొందిన శాస్త్రవేత్త అని పొగిడారు. అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం పౌండేషన్‌ వారి సాహిత్య, సామాజిక, సాంస్క ృతిక కార్యక్రమాలకు ఎల్లప్పుడు హాజరవుతూ సహృదయతను చాటుతుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.వాసం చంద్రశేఖర్‌, పీఆర్‌వో డా. వి. త్రివేణి, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా. రాంబాబు, ఏఇ వినోద్‌, ఏఆర్స్‌ విజయలక్ష్మి, సాయాగౌడ్‌, సూపరింటెండెంట్‌ భాస్కర్‌, లైబ్రేరియన్‌ సత్యనారాయణ తదితర సిబ్బంది పాల్గొనారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »