నారాయణఖేడ్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ నారాయణఖేడ్ మండలం వెంకటాపురం శివారులో అర్బన్ పార్క్లో ఫారెస్ట్ అధికారులు, మహిళలతో కలసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు.
అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అదేవిదంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.