నారాయణఖేడ్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురుపౌర్ణమిని పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సతీమణి జయశ్రీ రెడ్డితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఎమ్మెల్యే కూతురు పుట్టిన రోజు కూడా కావడంతో ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.