మోర్తాడ్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా తన పుట్టినరోజు సందర్భంగా ఏవో శాలువాలు, పూల దండలు కోరుకుంటారు కానీ కేటీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారని అన్నారు. మొక్కలు నాటి సమాజానికి పనికొచ్చే పని చేయండి అని పిలుపునిచ్చారని ఇది గొప్ప విషయం అన్నారు. ఆయన పిలుపునందుకొని ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌తో నేడు చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారన్నారు. అందరూ మంచి కార్యక్రమాన్ని ఇంట్లో కొడుకు పుట్టినరోజు కానీ తమ పుట్టిన రోజు సందర్భంగా కాని ఇంటిల్లిపాది ఒక మొక్క నాటుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.
రాబోయే కాలంలో చెట్లు మనని బ్రతికిస్తాయని చెట్లు లేనిది మనుగడ లేదన్నారు. మన తాతలు చెట్లు నాటినందున ఈరోజు మనకు ఇన్ని వర్షాలు పడుతున్నాయని, చెట్లు నరుక్కుంటూ పోవడం తప్ప మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో చేపట్టడం లేదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చెట్లు నరుక్కుంటూ పోతే సమాజం ఏమై పోవాలి అని, ఒకరోజు గాలి పీల్చుకోవడం కష్టమైన ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, సర్పంచ్ ధరణి ఆనంద్, ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్, డీఎఫ్‌ఓ సునీల్ డిఆర్‌డిఓ చందర్ నాయక్, ఆర్‌డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, తహసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.