కామారెడ్డి, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఆపరేషన్ నిమిత్తమై సంతోష్ అనే యువకునికి ప్రమాదంలో కాళ్ళు విరగడంతో ఆపరేషన్ నిమిత్తమై ప్రముఖ న్యాయవాది బండారు సురేందర్ రెడ్డి 25 వ సారి రక్త దానం చేశారు. అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బండారు నరేందర్ రెడ్డి లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళకు రక్తహీనతతో బాధపడుతుండటంతో ఏ పాజిటివ్ రక్తం శనివారం అందజేశారు.
అన్నదమ్ములిద్దరూ రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఒకే కుటుంబం నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి గత పది సంవత్సరాల నుండి రక్తాన్ని సకాలంలో అందజేయడం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, రాజు, నవీన్ పాల్గొన్నారు.