హైదరాబాద్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-2021) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌కు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మాకు 85,828 దరఖాస్తులు వచ్చాయి. కాగా రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్ విభాగానికి ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ. అదే అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ కోసం ఆగస్టు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు.