నేను కలం పట్టాను
కల్లోలిత ప్రాంతాలను శాంత పరచడానికి
నేను కాగితాన్ని పట్టాను
అభాగ్యుల కన్నీళ్లను ఒడిసి పట్టడానికి
నేను ఒక్కొక్క అక్షరాన్ని ముడి వేసి
బాధల ప్రవాహాన్ని బట్టబయలు చేశాను
నేను అనగారిన ప్రజల నుదిటి రాతల్ని
వర్తమానంగా లిఖించాను
సిరా చుక్కలను ఒక్కొక్కటి పోగుచేసి
బలిసిన దొరల భాగోతాలను ఒక్కొక్కటి బయట పెట్టాను
నా ఆలోచనలన్నింటినీ ఒకటిగా కూర్చి
నిరుద్యోగ యువత నిరాశా నిస్పృహలను పతాక శీర్షికల్లో ఎక్కించాను
నేను ఖాళీ సమయాల్ని ఎక్కుపెట్టాను
యెదల నిండ గాయాలతో కుములుతున్న వారికి
కవిత్వమనే సంజీవని రసాన్ని ఇచ్చాను
నేను కవిని అయ్యాను
కటిక పేదల కన్నీళ్లను కవిత్వంగా అల్లాను
రచయిత : రాదా పుత్ర
సెల్ : 9133338608