భీమ్గల్, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని బస్ డిపో పక్కన గ్రామ శివారులో ఉన్నటువంటి పోచమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మి తల్లి ఆలయాల వద్ద ఆదివారం భక్తులు బారులు తీరారు.
తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గ్రామ సంఘాలు, కుల సంఘాలు అమ్మవారికి మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుని వన భోజనాలకు బయలుదేరారు.