నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు, ప్రత్యేకాధికారులకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహిస్తున్నాయి.
ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని, పౌరులు, ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా నేపధ్యంలో ప్రదర్శన ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుందని, ఆన్‌లైన్‌లో ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రజలు ఆవిష్కరణలను చూడవచ్చన్నారు. ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలు ప్రోత్సహించడం జరుగుతుందని, గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి అంగీకరించబడతాయన్నారు.
ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, 9100678543 కి వాట్సాప్ చేయగలరు. ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగష్టు 10, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్‌లిస్ట్ తరువాత, ప్రతీ జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపికచేయబడుతారన్నారు. మరిన్ని వివరాలకు, (9848219365) జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్‌ని సంప్రదించాలన్నారు.