నందిపేట్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ రాజ్ నగర్ ఎంపిటిసి 2 పరిధిలోగల అరేబియన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న కాలనీలో ఇండ్ల మీద గల కరెంట్ తీగలను తొలగించిన విద్యుత్ అధికారులకు నందిపేట్ 2 ఎంపిటిసి ధన్యవాదలు తెలిపారు. కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి కాలనీవాసుల ఇండ్ల పైన ఉన్న 11 కెవి విద్యుత్ లైన్ ఉండడం వలన ఇండ్లలో కరెంట్ షాక్ వస్తున్నదని కాలనీవాసులు ఎంపిటిసి దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో సమస్యను మండల సర్వసభ్య సమావేశంలో ఎంపిటిసి అరుణ చౌహన్ ప్రస్తుతించగా విద్యుత్ శాఖ ఏఈ స్పందించి సోమవారం లైను తొలగించడమే కాకుండా పాత స్తంభాలను తొలగించి కొత్తవి పెట్టడంతో కాలనీవాసుల తరపున ఏఈ, లైన్మెన్లకు ఎంపీటీసీ అరుణ బజరంగ్ చవాన్ ధన్యవాదాలు తెలిపారు.