ఆర్మూర్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ముగ్గురు లబ్దిదారులకు పత్రి కమల, తీర్మన్ పల్లి చంద్ర, కాచర్ల లావణ్యలకు మూడు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పి.యు.సి చైర్మన్, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం మోహన్, వైస్ ఎంపిపి మోతె బోజకళ చిన్నారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి మల్లేష్, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, సొసైటీ చైర్మెన్ కళ్లెం బోజారెడ్డి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎత్తిన బోజన్న, వార్డు సభ్యులు మర్కంటి మహేష్, నల్లన్న పాల్గొన్నారు.