హైదరాబాద్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎస్‌ఆర్సీ) ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, అదీ కూడా దశల వారీగా తీసుకోవాలని ఆదేశించింది.
ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రిన్స్‌టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ చదువుతున్న లావణ్య అనే విద్యార్థిని వనపర్తిలో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏబీవీపీ ఫిర్యాదు చేయగా కాలేజీలను హెచ్చరిస్తూ టీఏఎఫ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.