డాక్టర్‌ ప్రతిమా రాజ్‌ సేవలు ఆదర్శనీయం

నిజామాబాద్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో వృత్తి నిర్వహించి, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని పేదల పాలిట సంజీవనిగా ఏడాది కాలంలో తీర్చిదిద్దిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమ రాజ్‌ సేవలు ఆదర్శనీయమని నిజామాబాద్‌ హరిదా రచయితల సంఘం ప్రతినిధులు ఆమెను అభినందించారు.

మంగళవారం చీఫ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో ప్రతిమరాజ్‌ను హరిదా రచయితల సంఘం పక్షాన ఘనపురం దేవేందర్‌, నరాల సుధాకర్‌, డాక్టర్‌ వెంకన్న గారి జ్యోతి, మద్దుకూరి సాయిబాబు, కొయ్యడ శంకర్‌, కొమిరిశెట్టి నాగరాజు సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రతిమ రాజ్‌ మాట్లాడుతూ క్రికెటర్‌ యువరాజ్‌ స్వచ్చంద సంస్థ 120 ఐసియు పడకలను హాస్పిటల్‌కు కేటాయించడంలో శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత సహకారం గొప్పదని కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా రోగులకు మరింత మేలైన సేవలు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. దాతలు దవాఖానా అభివృద్ధికి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. తన సహ వైద్యులు, సిబ్బంది సహకారంతో ఏడాది పాటు ఇక్కడ సేవలందించడం ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »