ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 3 తేదీ నుండి ఫీవర్‌పై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మూడు నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్‌ సర్వే చేపట్టాలని, ఆరు రకాల వ్యాధులపై ముఖ్యంగా కోవిడ్‌ స్టేటస్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఇప్పటికీ కరోనా తగ్గుట లేదన్నారు.

మన జిల్లాలో ఒక శాతం కేసులు వస్తున్నాయన్నారు. జిల్లాలో పరీక్షలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. గ్రామాలలో పరిస్థితి తెలుసుకోవడం కోసం సర్వే చేయాలన్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్మెంట్‌, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. ఇది వరకే వేరే వ్యాధులతో రిజిస్టర్‌ అయిన పేషెంట్ల పరిస్థితి తెలుసుకోవడానికి, కోవిడ్‌తో పాటు 5 వ్యాధులు, లెప్రసీ, హెచ్‌ఐవి, తలసేమియా తదితర ఆరు రకాల వ్యాధులకు సంబంధించి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌ సర్వే ద్వారా సమాచారం పక్కాగా తీసుకోవాలన్నారు.

రేపు ఎల్లుండి సర్వే పై ట్రైనింగ్‌ నిర్వహించాలన్నారు. ఈ పంచాయతీ ఆపరేటర్లకు టెక్నికల్‌గా అప్లికేషన్‌ వాడే విధానంపై ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రైనింగ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో, ఎంపిఓ, మున్సిపల్‌ కమిషనర్‌, మెప్మా టీమ్స్‌ ట్రైనింగ్‌ క్లాసులకు హాజరు కావాలని, ఆశ వర్కర్ల తోపాటుగా పంచాయతీ సెక్రెటరీ, ఎంపిఓలు, అంగన్వాడీ టీచర్లు, ఎంపీడీవో తప్పకుండా ఉండాలని సర్వే మాత్రం పక్కాగా జరగాలన్నారు.

గత సంవత్సరం చేసిన మోడల్‌లో పూర్తి సమాచారం సేకరించాలన్నారు. పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో సర్వే జరగాలని, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లాలని, ఆరు వ్యాధులకు సంబంధించిన వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లాలో హెల్త్‌ స్టాటిస్టిక్స్‌ తెలుస్తుందని కరోనా కిట్స్‌ అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్‌ లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్‌ ఇవ్వడం వాడడం తెలియజేయాలని, ఫీవర్‌ సర్వే ప్రతి ఇంటిలో ఉన్న వ్యక్తిని టచ్‌ చేసే విధంగా జరగాలని ఆయన అన్నారు. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మేజర్‌గా ఇన్స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ ఎస్సి, బిసి ఇన్స్టిట్యూషన్స్లలో బాగుందన్నారు.

ఎన్‌పిడిసిఎల్‌ సబ్‌ స్టేషన్‌ వారిగా చూసినప్పుడు ఖాళీ స్థలం ఉందని అన్నారు. పబ్లిక్‌ ఇన్స్టిట్యూషన్స్‌ ఏవైనా సరే ప్లాంటేషన్‌కు సంబంధించి లేబర్‌ లేఅవుట్‌ ప్రిపేర్‌ చేయాలని, ఇనిస్ట్యూట్‌ కు వచ్చే వ్యక్తికి మంచి మొక్కలు కనపడే విధంగా ఉండాలన్నారు. స్థలాన్ని బట్టి 3 వరుసలు పెద ప్లాంట్స్‌ ఉండాలన్నారు. ప్రభుత్వ సంస్థలలో ప్లాంటేషన్‌ వంద శాతం పూర్తి కావాలని రేపటి నుంచి ప్లాంటేషన్‌ ఎన్పీడీసీఎల్‌లో ప్లాంటేషన్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేయించాలన్నారు. చేయించే బాధ్యత ఏఈదే అన్నారు.

జిల్లాలో ఉన్న 235 సబ్‌ స్టేషన్‌లలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఫర్టిలైజర్‌ పిఏసిఎస్‌లో కొరత ఉండకూడదన్నారు. శానిటేషన్‌ మున్సిపాలిటీ ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా చేయించాలన్నారు. ఓవర్‌ ఫ్లో వాటర్‌ వెంటనే డ్రైనేజీలో వెళ్లే విధంగా చూడాలన్నారు. ప్లాంటేషన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌ డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, డిఎంహెచ్‌ఓ సుదర్శన్‌, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »