వేల్పూర్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటలను తాసిల్దార్ సతీష్, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నష్టపోవడంతో పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు.
నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నష్టపోయిన రైతుల వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.