ఆర్మూర్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణకే గర్వకారణం అయినటువంటి రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కోచే గుర్తింపు పొందడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం తెలంగాణకే కాదు ఈ దేశానికి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని 800ల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రామప్ప గుడి శివాలయం అని, దాని శిల్పి రామప్ప కావడంతో శిల్పి పేరునే రామప్ప గుడిగా స్థిరపడిరదన్నారు.
800ల సంవత్సరాల్లో తురష్కుల ఎన్నో దాడులలో తట్టుకొని నిలబడడం, అప్పటి కాకతీయుల శిల్పకళా వైభవానికి దర్పణంగా రామప్ప గుడి నీటిలో తేలే ఇటుకలతో నిర్మాణం అవ్వడం, గుడిలో స్తంభాలను మీటితే స రి గ మ ప ద ని సప్తస్వరాలు పలకడం, నాట్య కళా శిల్పాలు అద్భుతమైనటువంటి, మహోన్నతమైనటువంటి దేవాలయం అన్నానరు.
గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం, కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ కారణంగా రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో చే గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. ఈ ప్రయత్నంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శికారి శ్రీనివాస్, గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు భూసం ప్రతాప్, శ్యాంగౌడ్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఖాందేశ్ ప్రశాంత్, దుబ్బాక అధ్యక్షులు కొట్టాల నరేష్ గౌడ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్సింగ్, దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్యామ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పసుపుల సాయికుమార్, సైవే రాజు, విఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.