మోర్తాడ్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో బుధవారం పిఆర్‌టియు టిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు మగ్గిడి ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతూ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పిఆర్‌టియు టిఎస్ కృషి వల్లనే పిఆర్‌సి అమలు సాధ్యమైందన్నారు.
పిఆర్‌టియు అతి పెద్ద సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్ అన్నారు. కార్యక్రమంలో మగ్గిడి శంకర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు, వేల్పూరు మండల అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి నరేష్, భీంగల్ ప్రధాన కార్యదర్శి దేవరాజు, ఎడపల్లి మండల కార్యదర్శి శంకర్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాధ్యాయులు జగదీశ్వర్, శ్యామ్, మధు. సత్యనారాయణ సుమలత, లలిత తదితరులు పాల్గొన్నారు.