డిచ్‌పల్లి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిషా‘త్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమన్వయంతో మాస్ కమ్యూనికేషన్ విభాగం బుధవారం ‘‘ఇండియా డేటా పోర్టల్’’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించింది.
ముఖ్యఅతిథిగా పాల్గొని వర్క్ షాప్‌ను ప్రారంభించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అత్యంత అవశ్యం అన్నారు.
పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు ఇండియా డేటా పోర్టల్ వినియోగించడంలో మెళకువలు తెలుసుకుని, తమ పరిశోధన అంశాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఉపకులపతి పిలుపునిచ్చారు.
ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమన్వయంతో వర్క్ షాప్ నిర్వహించడం పట్ల మాస్ కమ్యూనికేషన్ విభాగాన్ని అభినందించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీం మాట్లాడుతూ పరిశోధనలు, అకడమిక్ ప్రచురణలు నాణ్యమైనవిగా రూపొందాలంటే సరైన డేటా అవసరమన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూ అధ్యాపకులు, పరిశోధకులు, పాలసీ మేకర్స్ వంటి వారికి ఇండియా డేటా పోర్టల్ ఒక విశ్వసనీయమైన వనరుగా ఉపయోగపడుతుందన్నారు. వర్క్ షాప్ డైరెక్టర్‌గా మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ జి చంద్రశేఖర్, కన్వీనర్‌గా డాక్టర్ కె రాజారామ్ కార్యశాల నిర్వహించారు.
సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కే శివ శంకర్, కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ వై. ప్రభంజన్ కుమార్ యాదవ్, డాక్టర్ పి శాంతాబాయి, ఇతర విభాగాల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.