హైదరాబాద్, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర శాఖ, మాజీ రాష్ట్ర చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీష్ రావుని కలిసి తక్షణమే ఐచ్చిక బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిఎస్సి-2003, సిపిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేస్తానని, సిపిఎస్ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటి వర్తింప చేశామని, మిగతా సమస్యలు కూడా పరిష్కరింప చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ, కామారెడ్డి అధ్యక్షులు అంబీర్ మనోహర్, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మిరాజాం, బాద్యులు కృపాల్ సింగ్, కనకపురం రవీందర్, ముత్తారం నరసింహ స్వామి, నాగేశ్వర్రావు, గంగాధర్ పాల్గొన్నారు.