వేల్పూర్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను గుర్తించి రేషన్ కార్డులు మంజూరు చేసిందని, ఇది సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమైందన్నారు. ఏ రాష్ట్రంలో చేయని ప్రభుత్వ పథకాలు తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సారెడ్డి, గ్రామ కార్యదర్శి సుచిత్ర, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.