నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వివాహిత మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం మహిళ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి ప్రసూతి సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్ యూటీఎఫ్ సంఘాలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. హర్షం వ్యక్తం చేసినవారిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అనికేశి రఘు, కొత్తపల్లి రాజేశ్వర్, సామ ప్రసాద్, ప్రభాకర్, మనోహర్ తదితరులు ఉన్నారు.