నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ ఎదుర్కొవడానికి సహాయం చేశారు. ఇందులో భాగంగా 3 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, 1500 మాస్కులు, 5 లీటర్ల సానిటైజర్ బాలిల్స్, 100 గ్లవుసులు, 5 హుమిడిఫైర్ బాటిల్స్ అందజేశారు.
కార్యక్రమంలో ఎస్బిఐ డిప్యూటి జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జానా, ఎజిఎం ధర్మేందర్ చౌహాన్, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుదీప్, డాక్టర్ సుప్రియ పాల్గొన్నారు.