కామారెడ్డి, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం వాసవి కళ్యాణ మండపంలో ఆనందయ్య కరోణ మందు పంపిణీ చేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ కామారెడ్డి పట్టణ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు చీల ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు వలిపిశెట్టి భాస్కర్, యువజన సంఘ సభ్యులు అందరూ కలిసి కరోనా నివారణ అయ్యే ఆనందయ్య ఆయుర్వేద మందును కామారెడ్డి ప్రజలకు అందజేయాలనే చొరవ అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతున్న యువజన సంఘ సభ్యులను అభినందించారు.
2 వేల మంది ప్రజలకు మందును ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా సమయంలో సామాజిక సేవ చేసిన ఆర్యవైశ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. ఆర్యవైశ్యులు అంటేనే సేవా నిరతికి నిలువెత్తు నిదర్శనం అని, సామాజిక సేవ చేయడంలో ఆర్యవైశ్యులకు సాటి ఎవరూ లేరన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శనిశెట్టి గౌరీశంకర్, కోశాధికారి గోవింద్ భాస్కర్, వాసవి సేవాదళ్ అధ్యక్షులు కస్తూరి నరహరి, కార్యదర్శి వలిపిశెట్టి లక్ష్మీరాజము, వాసవి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు అతిమాముల రమేష్ గుప్తా, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ముప్పారపు ఆనంద్, కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, జూలూరి సుధాకర్, యువజన నాయకులు గంప ప్రసాద్, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.