డిచ్‌పల్లి, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలోర శనివారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 661 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 312 మంది హాజరు, 1349 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. కాగా పీజీ నాల్గవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 1547 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1438 మంది హాజరు, 109 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 2-4 గంటల వరకు డిగ్రీ రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 4 వేల 120 మంది విద్యార్థులు నమోదు చేసుకోగాబీ 3 వేల 873 మంది హాజరు, 247 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. అలాగే పీజీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 25 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 25 మంది హాజరు, ఎవరు గైర్హాజరు కాలేదన్నారు.
మధ్యాహ్నం జరిగిన డిగ్రీ పరీక్షల్లో కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో బిజినెస్ ఎన్విరాన్ మెంట్ సబ్జెక్ట్‌లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు సివోయి వివరించారు.