ఆర్మూర్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్లో ఉన్న లాండ్రి, మంగలి దుకాణాల ధ్రువీకరణ పత్రాలు మున్సిపల్ శాఖ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా మంగలి, లాండ్రి దుకాణాలను ఉచితంగా విద్యుత్ అందిస్తామన్న హామీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు కాలనీలలో ఉన్న దుకాణాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరిగిందని, పరిశీలించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు.