కామారెడ్డి, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శనివారం కరోనా సమయంలో రక్తదాన, ప్లాస్మా కార్యక్రమాలు నిర్వహించి 100 యూనిట్ల ప్లాస్మాను, 850 యూనిట్ల రక్తాన్ని గత 13 సంవత్సరాలలో 8 వేల 500 యూనిట్ల రక్తాన్ని సేకరించి నందుకు గాను కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సన్మానించారు.
ఈ సందర్బంగా ఆర్యవైశ్య యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు వలిపిశెట్టి భాస్కర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో ఆణిముత్యంలాంటి వాడు బాలు అని నిస్వార్థంగా 13 సంవత్సరాలుగా వేలాదిమందికి సకాలంలో రక్తాన్ని అందించడం మామూలు విషయం కాదని, కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటికి వెళ్లడానికి ఆలోచిస్తే, ఏ మాత్రం భయపడకుండా 100 యూనిట్ల ప్లాస్మను సేకరించి ప్రాణాలు కాపాడారన్నారు.
వీరి సేవలు నేటి యువతరానికి ఎంతగానో స్ఫూర్తిని కలిగించడం జరుగుతుందని మరింతగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు వలిపిశెట్టి భాస్కర్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, పాత నవీన్, కలకుంట్ల రాజేష్, కొడిప్యాక సాయిరాం పాల్గొన్నారు.