డిచ్‌పల్లి, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ పూర్వక సన్మానాన్ని పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులను ఓయూ ఉపకుపతి ఆచార్య డి. రవీందర్ యాదవ్ అధికార పూర్వకంగా శనివారం ఉదయం సెనెట్ మీటింగ్ హాల్‌లో ఘనంగా సన్మానించారు.
గత సంవత్సర కాలంగా కొవిద్- 19 నిబంధనలు అమలులో ఉండడం, లాక్ డౌన్ విధించడం, రెగ్యూలర్ వీసీ లేకపోవడం వంటి కారణాల వల్ల పదవీ విరమణ పొందిన అధ్యాపకులను విశ్వవిద్యాలయం అధికార పూర్వకంగా సన్మానం చేయలేకపోయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో సుదీర్ఘ కాలం బోధనా, పరిశోధనానుభవం కలిగి ఉత్తమ సేవలు అందించిన ఆచార్య డి. రవీందర్‌ను ఓయూ వీసీ సన్మానించి, తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.
టీయూ వీసీ సన్మానాన్ని స్వీకరించడం పట్ల టీయూ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.