వేల్పూర్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్టు మండల పిఆర్టియు సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని పడగల గ్రామంలో పిఆర్టియు టిఎస్ ప్రాథమిక సభ్యత్వం జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్ ఇచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వనజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు, రమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రవీందర్, శ్రీనివాస్, విజయ్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.