నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సహకార శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువగా ఉండుటకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్ సేవల వ్యవస్థను 31వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ద్వారా జిల్లా సహకార అధికారి, సిబ్బంది సమక్షంలో ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఈరోజు నుండి http://esahakara seva.telangana.gov.in నందు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
వెబ్‌సైట్ ద్వారా సహకార శాఖలో సహకార సంఘముల చట్టం టిఎస్‌సిఎస్ 1964, ఎంఎస్‌సిఎస్ 1995 ల క్రింద రిజిస్టర్ కాబడునని, అన్ని సహకార సంఘాల రిజిస్ట్రేషన్ పారదర్శకంగా త్వరితగతిన రిజిస్ట్రేషన్ కొరకు ధరఖాస్తు చేసుకొని ఎప్పటికప్పుడు దరఖాస్తు స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చన్నారు. సరైన దరఖాస్తును పరిశీలించి 15 రోజుల లోపల సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయబడుతుందని, కావున నేటి నుండి సహకార సంఘాల రిజిస్ట్రేషన్ కొరకు ఈ వెబ్‌సైట్ నందు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా సహకార అధికారి తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే ఎస్.శివ కుమార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జిల్లా సహకార అధికారి, నిజామాబాద్, మొబైల్ నెంబర్: 9866639414 కి ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు.