3న ప్రజాప్రతినిధుల ఇళ్ళ ముట్టడి

వేల్పూర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పివైఎల్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్ట్‌ 3 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ యువత పాల్గొనాలని పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

వేల్పూర్‌ మండల కేంద్రంలో పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ 50 వేల ఉద్యోగాలు భర్తీ అంటు ప్రకటనలు చేస్తూ ఎన్నికలయ్యాక ఆ ప్రక్రియను ఆపేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని వారు విమర్శించారు. ఉన్నత చదువులు చదివి 35 ఏళ్ళు దాటిపోయి నోటిఫికేషన్‌లు లేక కుటుంబానికి భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలన్నీ కేసీఆర్‌ హత్యలేనన్నారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో లక్షా ఏడువేల ఖాళీల లెక్క తీశారని నేడు లక్షా తొంభై ఒక్క వేలకు ఆ ఖాళీలు చేరుకున్నాయని కానీ మొన్న క్యాబినెట్‌ భేటీలో 56 వేల ఖాళీలు మాత్రమే చూయిస్తున్నారని లక్షకు పైగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌లను ఖాళీలుగా చూపట్లేదని వారిని క్రమబద్ధీకరణ చేస్తారా లేక ఇలాగే వెట్టిచాకిరీ చేయించుకుంటారా అని ప్రశ్నించారు.

ఇలాంటి ఎన్నికల డ్రామాలు ఆపి లక్షా 91 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ చేయాలని జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రతీ ఆరు నెలలకు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్ట్‌ 3వతేదీన వేల్పూర్‌ మండల కేంద్రంలో గల మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమానికి జిల్లాలోని నిరుద్యోగ యువత తరలి రావాలని తద్వారా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచి నోటిఫికేషన్‌ల విడుదలకై లక్షా 91 వేల పోస్టుల భర్తీకై పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీ.డీ. యస్‌. యూ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్‌, సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »