నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆగస్టు 3 నుండి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు ప్రతి హ్యాబిటేషన్ నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం సంబంధిత అధికారులతో హెల్త్ సర్వే పై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో కోవిడ్ 19, టీబి, లెప్రసి, హెచ్‌ఐవి, తలసీమియా, డయాలసిస్ తదితర ఆరోగ్య సమస్యలపై ప్రతి కుటుంబానికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించి జిల్లా యంత్రాంగం తయారు చేసిన యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
సర్వేకు ముందుగానే అంటే శనివారమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మూడవ తేదీన ఉదయం 7 గంటలకే సంబంధిత అన్ని పీహెచ్‌సిలకు సూపర్‌వైజరీ అధికారులు, ఎంపీడీవోలు, మెడికల్ అధికారులు, అంగన్‌వాడి అధికారులు, ఇతర అధికారులు హాజరై ప్రణాళిక ప్రకారం సర్వేకు వెళ్లాలని సర్వేలో పక్కాగా అన్ని వివరాలు ప్రతి ఒక్కరి నుండి సేకరించి నమోదు చేయాలన్నారు.
గ్రామ పంచాయతీ స్థాయిలో మూడు రోజుల్లో, మున్సిపాలిటీ స్థాయిలో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. క్వాలిటీ పరంగా సర్వేలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆషామాషీగా కాకుండా సీరియస్‌గా సర్వే జరిగేలా సంబంధిత జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు పూర్తిస్థాయిలో కార్యక్రమాల్లో పాల్గొని సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఇతర మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ జయసుధ, డిడబ్ల్యూఓ రaాన్సీ, ఇంచార్జ్ డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, తదితరులు పాల్గొన్నారు.