Monthly Archives: July 2021

కొత్తపల్లిలో రేషన్‌ కార్డుల పంపిణీ

వేల్పూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన రేషన్‌ కార్డులను గ్రామ సర్పంచ్‌ నితీష్‌ కుమార్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఆర్మూర్‌లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఆర్మూర్‌ మున్సిపల్‌ 5వ వార్డ్‌ పరిధిలోని కోటర్మూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్‌ బండారి ప్రసాద్‌, 24 వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల రాము హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదానం

ఆర్మూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం లయన్స్‌ క్లబ్‌ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్‌ ఫాస్ట్‌ గవర్నర్‌ అంబాసిడర్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్‌ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గల గుమాస్తా కాలనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్మీన్‌ కుటుంబం గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే యాష్మీన్‌ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో (రామారెడ్డి రోడ్డు లో) అంబులెన్స్‌లో …

Read More »

డిపిఎంకు మెమో…

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో జరిగిన స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో ఆయన మండలాల …

Read More »

ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 002 …

Read More »

నీలోఫర్‌ రాణాకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్‌ రాణాకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్‌ రాణా ‘‘ద డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ – హెటేరో సైక్లిక్‌ కంపౌండ్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ ఆఫ్‌ దేర్‌ బయోలాజికల్‌ ఆక్టివిటీస్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …

Read More »

నష్టపోయిన పంట పరిశీలన

వేల్పూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎల్లయ్య, విస్తరణ అధికారి స్నేహ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించడం జరుగుతుందని, పరిశీలించిన వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Read More »

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన

వేల్పూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుల బృందం పరిశీలించినట్టు డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా బృందం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూడు జిల్లాలను హైదరాబాద్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌లను పైలెట్‌ జిల్లాలుగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర పరిశీలకులు ఐఇసి ద్వార జాతీయ ఆరోగ్య సమాచారమును ప్రభుత్వం అందజేసిన ఐఇసి మెటీరియల్‌ ద్వారా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »